Loading...
アイコン

GORETI GONTHU

チャンネル登録者数 2.98万人

19万 回視聴 ・ 3521いいね ・ 2023/08/14に公開済み

తూటాను మోసిన పాట l Tribute To Praja Gayakudu Gaddar l #ArunodayaNaganna l #Yochana l #GaddarSongs #goretigonthu

WRITER: YOCHANA
SINGER: ARUNODAYA NAGANNA
PRODUCER: GORETI RAMESH
MUSIC: GOGU AKHIL AG STUDIO
DOP & EDITTING: BALU
#అరుణోదయం
#goretiramesh
#goretigonthu
#goreti
#arunodaya
#arunodayasongs
#naganna
#yochana
#agstudio
#telanganafolksong
#gaddar
#gaddarpassesaway
#vimalakka
#viplavaganam
#letestsong
#telanganafolksong
#folksongs
#podusthunnapoddumida
#patanaivasthunna
#banisalaralendira

పల్లవి:
పచ్చని అడవిలో సింధూరం
పాటకు భూసిన మందారం
నెత్తురు తడిసిన భూగోళం
ఎత్తున జెండే నీ గాణం
నీ పాటే సాయుధ సమరం
అది విప్లవచరితలో అమరం
గద్దరన్న నీ గాణం
గర్జించే యుద్ధ నినాదం.

చరణం:1
పూసిన మోదుగు పూవనం
వికసించిన ఎర్రని కేతనం
నీ పాటకు దండకారణ్యం
సాగించెను గెరిల్లా పోరాటం
గదరంటేనే విప్లవం
దద్దరిల్లింది ఈ శకం
నువు కట్టిన గోసి గొంగడి అణగారిన ఆకలి సింగిడి
నీ కాలి గజ్జెల సవ్వడి
చల్..దోపిడీ గుండెల అలజడి
నీ పాటకు రాజ్యం భయపడి
తూటాలతో చేసెను దాడి
తూపురానులో తుఫానులాగా పుట్టే గద్దరన్న
మూపురానికి తుపాకీ కట్టి పాటకట్టేనన్న..

చరణం:2
నెత్తుటి ఏరులు పారిన ఊర్లు
చుండూరయ్యేను రక్తపుటేర్లు
నక్షల్బరీ శ్రీకాకుళపోరు
ఇంద్రవెళ్లి జనసంద్రపు హోరు
గదరంటేనే నక్షల్బరీ
దొరతనానికే పాట ఉరి
శత్రువుకెదురుగా నిలబడి
మృత్యువుతోని తలబడి
భూస్వాములతో కలబడి
తరిమికొట్టేను వెంటబడి
రక్కసి మూకల కంట్లబడి
కాల్చిరి నిన్ను వెంటబడి
తూపురానులో తుఫానులాగా పుట్టే గద్దరన్న
మూపురానికి తుపాకీ కట్టి పాటకట్టేనన్న..

コメント

コメントを取得中...

コントロール
設定

使用したサーバー: wata27